మేలుకొలుపు పాటకేశవ నామాలు సంకల్పబలాన్నిచ్చే దివ్య మంత్రాలు. హిందూ సంప్రదాయంలో ప్రధానమై, నిత్యం స్మరించే ఈ దివ్య నామాలను ఒక మేలుకొలుపు పాటగా పాడుకోవడం ఆనాటి స్త్రీలలో చాలామందికి ఆనవాయితీ.1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులువర్ణించు చున్నారు మేలుకో,వాసవ వందిత వసుదేవ నందనవైకుంఠ వాసుడా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
Melukolupu paataKeshava naamaalu sankalpabalaannichche divya mantraalu. hindoo sampradaayamlo pradhaanamai, nityam smarinche ee divya naamaalanu oka melukolupu paatagaa paadukovadam aanaati streelalo chaalaamandiki aanavaayitee.1. Keshava yani ninnu vaasiga bhaktuluVarninchu chunnaaru meluko,Vaasava vandita vasudeva nandanaVaikuntha vaasudaa meluko ॥ krishnaa meluko ॥
2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తులకరుణ బ్రోతువు వేగ మేలుకో,శరణన్న రక్షణ బిరుదు నీకున్నదిశశిధర సన్నుతా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
2. Naaraayanaa ninnu - nammina bhaktulaKaruna brotuvu vega meluko,Sharananna rakshana birudu neekunnadiShashidhara sannutaa meluko ॥ krishnaa meluko ॥
3. మాధవ యని నిన్ను యాదవులందరుమమత గొల్తురు దేవ మేలుకో,చల్లని చూపుల మెల్లగా బరపెడునల్లని నాస్వామి మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
3. Maadhava yani ninnu yaadavulandaruMamata golturu deva meluko,Challani choopula mellagaa barapeduNallani naasvaami meluko ॥ krishnaa meluko ॥
4. గోవింద యని నిన్ను గోపికలందరుగోపాలయని పిల్తురు మేలుకోవెన్నముద్దలు చల్ది వేడుకగా తిన్నాలవేణుగోపాలుడవు మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
4. Govinda yani ninnu gopikalandaruGopaalayani pilturu melukoVennamuddalu chaldi vedukagaa tinnaalaVenugopaaludavu meluko ॥ krishnaa meluko ॥
5. విష్ణు రూపముదాల్చి విభవము నగుపించువిష్ణు స్వరూపుడ మేలుకో,దుష్టసంహారక దురితము లెడబాపుసృష్టి సంరక్షక మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
5. Vishnu roopamudaalchi vibhavamu nagupinchuVishnu svaroopuda meluko,Dushtasamhaaraka duritamu ledabaapuSrishti samrakshaka meluko ॥ krishnaa meluko ॥
6. మధుసూదన నీవు మగువ తోడుత గూడిమరచి నిద్రించేవు మేలుకో,ఉదయార్క బింబము ఉదయించు వేళాయెవనరుహ లోచన మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
6. Madhusoodana neevu maguva toduta goodiMarachi nidrinchevu meluko,Udayaarka bimbamu udayinchu velaayeVanaruha lochana meluko ॥ krishnaa meluko ॥
7. త్రివిక్రమా యని శక్రాదులందరువిక్రమ మందురు మేలుకో,శుక్రాది గ్రహములు సుందరరూపముచూడగోరుచున్నారు మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
7. Trivikramaa yani shakraadulandaruVikrama manduru meluko,Shukraadi grahamulu sundararoopamuChoodagoruchunnaaru meluko ॥ krishnaa meluko ॥
8. వామన రూపమున భూదాన మడిగినపుండరీకాక్షుడా మేలుకో,బలిని నీ పాదమున బంధన జేసినకశ్యప నందనా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
8. Vaamana roopamuna bhoodaana madiginaPundareekaakshudaa meluko,Balini nee paadamuna bandhana jesinaKashyapa nandanaa meluko ॥ krishnaa meluko ॥
9. శ్రీధర గోవింద, రాధా మనోహరయాదవ కులతిలక మేలుకో,రాధావధూమణి రాజిల్క నంపిందిపొడచూతువుగాని మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
9. Shreedhara govinda, raadhaa manoharaYaadava kulatilaka meluko,Raadhaavadhoomani raajilka nampindiPodachootuvugaani meluko ॥ krishnaa meluko ॥
10. హృషీకేశ యీ భువియందు ఋషులందరువచ్చి కూర్చొన్నారు మేలుకో,వచ్చినవారికి వరములు కావలెవైకుంఠ వాసుడా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
10. Hrisheekesha yee bhuviyandu rishulandaruVachchi koorchonnaaru meluko,Vachchinavaariki varamulu kaavaleVaikuntha vaasudaa meluko ॥ krishnaa meluko ॥
11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులువచ్చి కూర్చున్నారు మేలుకో,పరమ తారకమైన పావన నామముపాడుచు వచ్చిరి మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
11. Padmanaabha needu patni - bhaagaaduluVachchi koorchunnaaru meluko,Parama taarakamaina paavana naamamuPaaduchu vachchiri meluko ॥ krishnaa meluko ॥
12. దామోదరా యని దేవతలందరుదర్శించ వచ్చిరి మేలుకో,భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావెభూకాంత రమణుడా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
12. Daamodaraa yani devatalandaruDarshincha vachchiri meluko,Bhoomi bhaaramu maanpa budhula brovanu raaveBhookaanta ramanudaa meluko ॥ krishnaa meluko ॥
13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్పసమయమై యున్నది మేలుకో,పంకజాక్షులు నీదు పావన నామముపాడుచు వచ్చిరి మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
13. Sankarshana neevu shatrusamhaara monarpaSamayamai yunnadi meluko,Pankajaakshulu needu paavana naamamuPaaduchu vachchiri meluko ॥ krishnaa meluko ॥
14. వాసుదేవా నీకు భూసుర పత్నులుభుజియింప దెచ్చిరి మేలుకో,భూసురంబుగ యాగసంరక్షణ కొరకువర్ణింపు చున్నారు మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
14. Vaasudevaa neeku bhoosura patnuluBhujiyimpa dechchiri meluko,Bhoosurambuga yaagasamrakshana korakuVarnimpu chunnaaru meluko ॥ krishnaa meluko ॥
15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడదుర్జన సంహార మేలుకో,అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జనాదరించిన దేవ మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
15. Pradyumna roopuda arjuna varadudaDurjana samhaara meluko,Abjavamshamunandu udbhavinchiyu kubjaNaadarinchina deva meluko ॥ krishnaa meluko ॥
16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులుఅనుసరింప వచ్చె మేలుకో,అండజవాహన అబ్ధిగర్వాంతకదర్భశయన వేగ మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
16. Aniruddha yani ninnu abjabhavaaduluAnusarimpa vachche meluko,Andajavaahana abdhigarvaantakaDarbhashayana vega meluko ॥ krishnaa meluko ॥
17. పురుషోత్తమా యని పుణ్యాంగనలందరుపూజలు జేతురు మేలుకో,పురుహూతవందిత పురహర మిత్రుడపూతన సంహార మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
17. Purushottamaa yani punyaanganalandaruPoojalu jeturu meluko,Puruhootavandita purahara mitrudaPootana samhaara meluko ॥ krishnaa meluko ॥
18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారిదురితము నెడబాప మేలుకో,వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారివందన మొసగెద మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
18. Adhokshaja mimmu smarana jesinavaariDuritamu nedabaapa meluko,Varusatoduta mimmu smarana jesinavaariVandana mosageda meluko ॥ krishnaa meluko ॥
19. నారసింహ నిన్ను నమ్మిన భక్తులకరుణబ్రోతువు వేగ మేలుకో,శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రిశశిధరసన్నుతా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
19. Naarasimha ninnu nammina bhaktulaKarunabrotuvu vega meluko,Sharananna rakshana birudu galgina tandriShashidharasannutaa meluko ॥ krishnaa meluko ॥
20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులుకొనియాడవచ్చిరి మేలుకో,పచ్చని చేలమూ అచ్చంగ దాల్చినలక్ష్మీమనోహర మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
20. Achyutaa yani ninnu satyamuga vratavidhuluKoniyaadavachchiri meluko,Pachchani chelamoo achchanga daalchinaLakshmeemanohara meluko ॥ krishnaa meluko ॥
21. 'జనార్దనా నీవు శత్రుసంహార మొనర్చసమయమైయున్నది మేలుకో,పంకజాక్షులు నీదు పావననామముపాడుచువచ్చిరి మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
21. 'Janaardanaa neevu shatrusamhaara monarchaSamayamaiyunnadi meluko,Pankajaakshulu needu paavananaamamuPaaduchuvachchiri meluko ॥ krishnaa meluko ॥
22. ఉపేంద్రా యని నిను నువిదలందరు గూడియమునతీర మందున్నారు మేలుకో,గోపీకాంతలు నీదురాక గోరుచున్నారుమురళీనాదవినోద మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
22. Upendraa yani ninu nuvidalandaru goodiYamunateera mandunnaaru meluko,Gopeekaantalu needuraaka goruchunnaaruMuraleenaadavinoda meluko ॥ krishnaa meluko ॥
23. హరి యని నిన్ను కొనియాడ గోపికాజనులంత వచ్చిరి మేలుకో,అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారువనమాలికాధర మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
23. Hari yani ninnu koniyaada gopikaaJanulanta vachchiri meluko,Ashtabhaaryalu needu raakagoruchunnaaruVanamaalikaadhara meluko ॥ krishnaa meluko ॥
24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురుబంతులాడ వచ్చిరి మేలుకో,కాళీయ మర్దన కౌస్తుభ మణిహారకంససంహరణా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
24. Shreekrishnaa yani ninnu gopaala baaluruBantulaada vachchiri meluko,Kaaleeya mardana kaustubha manihaaraKamsasamharanaa meluko ॥ krishnaa meluko ॥
25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ముసేవించుచున్నారు మేలుకో,తాటకాసంహార ఖరదూషణాంతకకాకుత్థ్సకులరామా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
25. Shreeraama yani munulu sthirabhaktito mimmuSevinchuchunnaaru meluko,Taatakaasamhaara kharadooshanaantakaKaakutthsakularaamaa meluko ॥ krishnaa meluko ॥
26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందెనల్లని నాస్వామి మేలుకో,వేళాయె గోవులమందకు పోవలెగోపాల బాలుడా మేలుకో ॥ కృష్ణా మేలుకో ॥
26. Tellavaaravachche dikkulu telupondeNallani naasvaami meluko,Velaaye govulamandaku povaleGopaala baaludaa meluko ॥ krishnaa meluko ॥
Editions differ in some words, and online copies can contain typing errors. If your family's book or your guru reads differently, please follow them.
Text from Telugu Wikisource, available under CC BY-SA 4.0. The other scripts were converted from it automatically.